'ఈనెల 18న కార్గోలోని పాత వస్తువుల వేలం'

'ఈనెల 18న కార్గోలోని పాత వస్తువుల వేలం'

ADB: ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్గో పార్సిల్ కేంద్రం పెండింగ్‌లో ఉన్న వస్తువులకు ఈనెల 18న వేలం పాటు నిర్వహించినట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. కార్గో పార్సిల్ ద్వారా ప్రజలు తీసుకెళ్లని పాత వస్తువులకు 18న ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తిగల ప్రజలు ఈ వేలం పాటలు పాల్గొనవచ్చని ఆయన సూచించారు.