కలెక్టర్ బాలాజీని కలిసిన ఎంపీడీవోలు

కలెక్టర్ బాలాజీని కలిసిన ఎంపీడీవోలు

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్ బాలాజీని జిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన పలువురు డిప్యూటీ ఎంపీడీవోలు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపి, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.