VIDEO: HIT TV కథనానికి దిగొచ్చిన అధికారులు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ''పెద్ద చెరువు తూము నుంచి వృధాగా పోతున్న నీరు'' అనే శీర్షికతో నిన్న HIT TVలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీంతో తూము గేటును నీటికారి సహాయంతో కిందికి దింపించి అరికట్టారు. ఈ సందర్భంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన HIT TVకి రైతులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.