పెడన నియోజకవర్గంలో అక్రమంగా చెరువుల తవ్వకాలు
కృష్ణా: పెడన నియోజకవర్గంలో నిబంధనలు, నియమాలకు విరుద్ధంగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో గ్రామసభలు నిర్వహించకుండానే సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లకు రెవెన్యూ అధికారులు లొంగిపోయారని, అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని మండిపడుతున్నారు.