ఫాల్కన్‌ కేసు.. వేలానికి జెట్‌ విమానం

ఫాల్కన్‌ కేసు.. వేలానికి జెట్‌ విమానం

TG: మనీలాండరింగ్‌ కేసులో సీజ్‌ చేసిన జెట్‌ విమానాన్ని బేగంపేటలో ఈ నెల 9న ఈడీ వేలం వేయనుంది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో అమర్దీప్‌సింగ్‌ మోసాలకు పాల్పడగా.. అతని వద్ద ఉన్న హకర్‌ 800ఏ జెట్‌ విమానాన్ని శంషాబాద్‌లో పోలీసులు సీజ్‌ చేశారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు ఇవ్వనున్నారు.