సంచలనం.. 30 ఓట్ల తేడాతో విజయం
బీహార్ ఎన్నికల ఫలితాల్లో మాయావతి నేతృత్వంలోని BSP ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. రామ్‌గఢ్ స్థానంలో తన సమీప ప్రత్యర్థిపై కేవలం 30 ఓట్ల తేడాతో సతీష్ కుమార్ యాదవ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశోక్‌కు 72,659 ఓట్లు రాగా, సతీష్‌కు 72,689 ఓట్లు వచ్చాయి. కాగా, ఇటీవల కాలంలో BSPకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం.