VIDEO: 'ఇసుక అక్రమ రవాణాపై చేస్తే కఠిన చర్యలు తప్పవు'
MBNR: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రజిని కుమారి హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో రెండు ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపైకేసులు నమోదు చేశామన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు.