'దేవాదాయ భూములు బహిరంగ వేలం'

కోటబొమ్మాళి దేవాదాయ శాఖ కార్యాలయం పరిధిలోని పలు దేవాలయాల ఆస్తులు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని ఈవో వాకచర్ల రాధాకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మల్లేశ్వర దేవాలయానికి చెందిన 6.26 ఎకరాలు ఈనెల 18న ఉదయం 10 గంటలకు దేవస్థానం కార్యాలయం వద్ద వేలం వేస్తామని చెప్పారు. పాతనౌపడ, కూర్మనాథపురం, కస్పానౌపడ దేవాలయాలకు చెందిన భూములు మూడేళ్లకు కౌలుకు వేలం వేస్తామని తెలిపారు.