'ప్రతి ఇంట్లో ఒక 'సైబర్ సింబా' ఉండాలి'
HYD: హైదరాబాద్ కవాడీగూడలో "జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్" సైబర్ అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్వీయ అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ఒక 'సైబర్ సింబా' వాలంటీర్ ఉంటే సమాజం సురక్షితమవుతుందన్నారు. ప్రజలు అనుమానాస్పద కాల్స్, లింక్స్, యాప్స్‌ను నమ్మరాదని సూచించారు.