సిద్దవటంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

సిద్దవటంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

KDP: సిద్దవటం మండలంలోని మూల పల్లెలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ మాజీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి టీడీపీ పతాకాన్ని ఎగరవేసి కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నేతలు ఉత్సాహంతో జయహో తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.