సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కొనకళ్ల

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కొనకళ్ల

కృష్ణా: అవనిగడ్డ పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బుధవారం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం వారికి బీమాతో కూడిన సభ్యత సౌకర్యం కలిపిస్తుంది అని తెలిపారు. జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.