తొర్రూర్‌లో 4 కిలోల గంజాయి పట్టివేత

తొర్రూర్‌లో 4 కిలోల గంజాయి పట్టివేత

MHBD: అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తొర్రూరు రెండవ ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో తన సిబ్బందితో తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే గంజాయి అతడికి ఎక్కడి నుంచి వచ్చింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.