విశాఖ ఐటీ అభివృద్ధిపై కేబినెట్ కీలక నిర్ణయాలు

విశాఖ ఐటీ అభివృద్ధిపై కేబినెట్ కీలక నిర్ణయాలు

VSP: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో విశాఖ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాలలో రవాణా సులభతరం కోసం రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలిపారు. అలాగే, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ IT క్యాంపస్‌కు 2 ఎకరాలు, ఫ్లూయెంట్‌గ్రిడ్ IT క్యాంపస్‌కు 3.3 ఎకరాలు కేటాయించారు. ఈ నిర్ణయాలతో విశాఖలో ఐటీ రంగం మరింత బలోపేతం కానుంది.