'గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి'

అన్నమయ్య: గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని MPP మేడా విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నందలూరులోని MPDO కార్యాలయ సభా భవనంలో MPDO రాధాకృష్ణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.