VIDEO: అయినవిల్లి మండలంలో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలంలో ఆదివారం ఉదయం నుంచి పలు గ్రామాలలో ఈదురు గాలులు, కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, పిడుగులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రయాణికులు, దూరప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారి రైతులు మిల్లులకు పంపాల్సిన ధాన్యం కల్లాలలో ఉంచారు. ఆ ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.