మాజీ మంత్రి కలిసిన వైసీపీ నేతలు
W.G: తాడేపల్లిగూడెంలో మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజుని ఆయన స్వగృహంలో వైస్సార్సీపీ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు, వైసీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. గూడెంలో పార్టీ పటిష్టతకు సహకరించాలని రంగరాజుని కోరారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఉన్నారు.