బిజినెస్ అసోసియేట్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

GNTR: ఉమ్మడి జిల్లాలో సిమ్ కార్డులు, మొబైల్, NTTH సేవల విస్తరణకు బీఎస్ఎన్ఎల్ బిజినెస్ అసోసియేట్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీఎం ఎస్. శ్రీధర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులు ఆధార్, పాన్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, రూ.100 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్ తీసుకురావాలి. 0863-2248500, 2248532 నంబర్లలో సంప్రదించవచ్చు అన్నారు.