రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆటో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన యశ్వంత్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.