మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం: ఎస్సై

మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం: ఎస్సై

W.G: మాదకద్రవ్యాల వినియోగం వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎస్సై మురళీమోహన్ హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'డ్రగ్స్ దుష్పరిణామాలు డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర' అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.