అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
HNK: శాయంపేట మండలం మైలారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ చావత్ బజ్ పాయ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులకు సూచించారు.