సెన్సస్–2027కు విశాఖ జిల్లా సర్వంసిద్ధం

సెన్సస్–2027కు విశాఖ జిల్లా సర్వంసిద్ధం

VSP: జిల్లాలో సెన్సస్–2027ను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో, రెండు దశల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌గా తానే జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తారని, తహశీల్దార్లు అదనపు అధికారులుగా బాధ్యతలు చేపడతారన్నారు.