చీరాలలో డ్రగ్స్ నియంత్రణపై ర్యాలీ

చీరాలలో డ్రగ్స్ నియంత్రణపై ర్యాలీ

BPT: చీరాలలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ నియంత్రణపై ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజం అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటి యువత డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. డ్రగ్స్ వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.