మోతెలో వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణం
SRPT: మోతె మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల కల్యాణ మహోత్సవం ఇవాళ భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.