నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వై. వసంతరావు తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగించడం, మరమ్మతుల పనుల కోసం ఈ అంతరాయం ఏర్పడుతుందని, వెంగళరావు నగర్, బాలకృష్ణారెడ్డి నగర్, జనతా పేట సౌత్ ప్రాంతాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.