శతజయంతి ఉత్సవాల కోసం ‘SAI100’ యాప్ ప్రారంభం
సత్యసాయి: పుట్టపర్తిలో జరుగుతున్న సత్య సాయి శతజయంతి ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ యాప్‌లో రోజు వారీ ఈవెంట్ వివరాలు, వసతి సమాచారం, వాహనాల పార్కింగ్ స్థలాలు, తాగునీటి పాయింట్లు, కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.