జనగణన శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్
HYD: బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన జనగణన శిక్షణ కేంద్రాన్ని GHMC కమిషనర్ ఆర్. వి. కర్ణన్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ సర్కిల్-36 పరిధిలో నిర్వహణ, సౌకర్యాలు, ప్రిపరేషన్‌పై సమీక్షించారు. ఆయన అధికారులతో మాట్లాడుతూ.. ఖచ్చితత్వం, సమన్వయం, సమయపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన వనరులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.