రాష్ట్ర స్థాయి పోటీలకు బోయినపల్లి యువకుడు

రాష్ట్ర స్థాయి పోటీలకు బోయినపల్లి యువకుడు

సిరిసిల్ల: బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటి శ్రీకాంత్ 51వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యారు. ఈ నెల 5 నుండి 7 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ పోటీలలో ఆయన పాల్గొంటారు. గుంటి శ్రీకాంత్ ఎంపిక పట్ల గ్రామ ప్రజలు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరింత రాణించాలన్నారు.