VIDEO: జగిత్యాలలో సభా ప్రాంగణం మొత్తం గులాబీ శ్రేణులు
జగిత్యాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు మరికొద్ది సేపట్లో మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం కళకళలాడుతోంది. కేసీఆర్ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారని ఆసక్తి నెలకొంది.