శుభ్రంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎంపీడీవో

శుభ్రంగా ఉండేలా ప్రజలకు అవగాహన  కల్పించాలి: ఎంపీడీవో

AKP: ఎస్.రాయవరం మండల కేంద్రంలో ఇవాళ ఉదయం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ డోర్ టూ డోర్ శానిటేషన్ పనులను పరిశీలించారు. గృహాల నుంచి గ్రీన్ మిత్రాలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న విధానాన్ని చూస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.