ధర లేక రోడ్డుమీద పారబోసిన చామంతి పూలు
సత్యసాయి: కదిరి పట్టణం కోనేరు వీధి సమీపంలో శుక్రవారం చేమంతి పూల రైతు ధర లేక రోడ్డుమీద పారవేశాడు. రైతు వివరాల మేరకు ఓడిసి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ తనకున్న రెండు ఎకరాల పొలంలో చేమంతి పూల సాగు చేశాడు. కోత సమయంలో మార్కెట్లో కిలో ధర ఐదు రూపాయలు పలకడంతో రోడ్డున పడేసి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.