UPDATE: బస్సు ఢీకొని మహిళ మృతి..సీసీ ఫుటేజ్

UPDATE: బస్సు ఢీకొని మహిళ మృతి..సీసీ ఫుటేజ్

HYD: అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మహిళను బస్సు ఢీ కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.