జంగారెడ్డిగూడెంలో ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనీ కోరారు. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం కనీస వేతనం రూ. 32,000 ఇవ్వాలన్నారు. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి ఆందోళనలు చేపడతామని తెలిపారు.