రేపల్లె రైల్వే లైన్‌కు కేంద్రం ముందడుగు..!
BPT: రేపల్లే నూతన రైల్వేలైన్ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిందని మంత్రి అశ్విని వైష్టవ్ తెలిపారు. పార్లమెంటులో జరిగిన చర్చలో ఈ ప్రాజెక్టు తాజా స్థితిగతులపై స్పష్టతనిచ్చారు. బాపట్ల నుంచి రేపల్లె వరకు 46 కిలోమీటర్ల నూతన రైల్వే లైనుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బాపట్ల ఒక ప్రధాన రైల్వే జంక్షన్గా మారుతుందన్నారు.