తెలంగాణ చౌరస్తాలో ఆందోళన

MBNR: పహల్గామ్ పర్యాటకులపై ఉగ్ర దాడికి నిరసనగా మహబూబ్‌నగర్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అమాయక పర్యాటకులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.