జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారు: వేమారెడ్డి

జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారు: వేమారెడ్డి

GNTR: జగన్ అమలు చేసిన పథకాలను కాపీ కొట్టి, వాటికి అదనంగా మరో ఆరు పథకాలు ఇస్తానని సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ మంగళగిరి ఇన్‌ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. శనివారం రాత్రి మంగళగిరిలో నిర్వహించిన బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అజెండా అని ఎద్దేవా చేశారు.