నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

CTR: చిత్తూరులోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న బాలికల వసతి గృహ పనులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పనుల నాణ్యతను కచ్చితంగా పాటిస్తూ, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.