కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రారంభం
NGKL: తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యారంగం మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, గ్రామ సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.