ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

EG: కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన గుంటూరు అనంతలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాబడిన రూ. 25, 000 చెక్కును లబ్ధిదారుని ఇంటివద్ద కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.