VIDEO: రామాయంపేట ఆలయాల్లో చోరీ

MDK: రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక మల్లన్న దేవాలయంలోకి చొరబడిన దొంగలు హుండీ ఎత్తుకెళ్లారు. మెదక్ చౌరస్తాలోని హనుమాన్ దేవాలయంలోకి చొరబడిన దొంగలు ఆలయంలోని హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మల్లన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డ దొంగల వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది.