VIDEO: తొత్తరమూడిలో రహదారి పక్కనే చెత్తకుప్ప
కోనసీమ: ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామస్థాయిలో మాత్రం పరిసరాల పరిశుభ్రత పూర్తిస్థాయిలో ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయినవిల్లి మండలంలోని తొత్తరమూడి గ్రామంలో ప్రధాన రహదారి చెంతన భారీగా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్తను తరలించేందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.