VIDEO: రక్తహీనత నివారణ కమిటీ సమావేశం

VZM: రక్తహీనత నివారణ కమిటీ సమావేశం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన పనసభద్ర గ్రామంలో ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా రక్తహీనతతో ఉన్న గర్భిణీలు, మహిళల రిపోర్టులను కలెక్టర్ పరిశీలించి వారితో మాట్లాడారు. జిల్లాలో రక్తహీనత ఎక్కువగా ఉందని, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్య ఉంటుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవలన్నారు.