లారీ బోల్తా.. వ్యక్తికి గాయాలు

ప్రకాశం: మద్దిపాడు మండలం వెంకటరాజు పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళుతున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తుతో నడుపుతుండగా వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్రేన్ సహాయంతో లారీను బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.