ఓదెల ఫార్మసిస్ట్ రవీందర్ సస్పెండ్

PDPL: ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న కే.రవీందర్ గృహహింసకు పాల్పడుతూ భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేయడంతో అతడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. సఖి కేంద్రం కౌన్సిలింగ్‌కు రవీందర్ సహకరించకపోవడంతో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.