అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టివేత
NGKL: అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో నల్ల బెల్లం, పట్టికను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. రూ. 2.70 లక్షల విలువైన 99 బస్తాల నల్ల బెల్లం, 40 కిలోల పట్టికను సీజ్ చేశారు. ఐనోల్కు చెందిన గణేష్‌ను అదుపులోకి తీసుకుని, బుధవారం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.