లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవంపై కీలక ప్రకటన
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవం మంగళవారం ఉదయం ఘనంగా జరగనుంది. మార్చి 10న ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో రథం కదలనుందని వేదపండితులు తెలిపారు. ఈ చారిత్రాత్మక రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.