డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు పూర్తిచేయాలి: కలెక్టర్
BHNG: సింగన్నగూడెంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇళ్ల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులపై అధికారులను ఆరాతీశారు. ఇంకా పనులు ప్రారంభించని చోట కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా అన్ని పనులు పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు.