పుతిన్‌కి పిచ్చిపట్టినట్లుంది: ట్రంప్‌

పుతిన్‌కి పిచ్చిపట్టినట్లుంది: ట్రంప్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరం లేకపోయినా ఉక్రెయిన్‌పై దాడి చేసి చాలా మందిని బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా.. రష్యా పతనానికి దారితీస్తుందని గట్టిగా హెచ్చరించారు.