VIDEO: అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
JGL: వేసవి సెలవులు ప్రారంభం కావడంతో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారం సందర్భంగా అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సంఖ్య పెరగడంతో పార్కింగ్, త్రాగునీరు, క్యూలైన్ వంటి సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.