ఆచారి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత మృతి
W.G: భీమవరం విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ మాజీ అధ్యక్షులు, ఆచారి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత పట్నాల సోమలింగాచారి (70) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆలపాడులో కొల్లేరు సరస్సుపై రవాణాకు అనుకూలంగా వంతెన ఆయన నిర్మించారు. ఆధ్యాత్మిక, కళా రంగాలకు, కష్టంలో ఉన్న వారికి తన వంతు ఆర్థికసాయం అందించే వారని పలువురు కొనియాడారు.