నందగోకుల్‌లో మొదటిసారి రాములోరి కళ్యాణం
మెదక్: నిజాంపేట(M) నందగోకుల్ గ్రామంలో మొదటిసారి శ్రీ రాముని కళ్యాణం సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి, గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణం గ్రామ శ్రేయస్సు కోసం నిర్వహించడం జరిగిందన్నారు. రాములోరి కళ్యాణం మొదటిసారి గ్రామంలో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు.